బుల్లి తెరమీద హీరోలా అమాయకంగా కనిపించే వ్యక్తి నిజజీవితంలో విలన్

 


 బుల్లి తెరమీద హీరోలా అమాయకంగా కనిపించే వ్యక్తి నిజజీవితంలో విలన్ గా మారి తనభార్యకు నరకం చూపిస్తున్నాడు. భార్య ఉండగానే పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని తాళి కట్టిన భార్యను హింసిస్తున్నాడని అతడి భార్య అరుణ అలియాస్ సాధన పోలీసులను ఆశ్రయించింది.


వదినమ్మ, చంద్రలేఖ వంటి సీరియల్స్‌లో హీరోగా నటిస్తున్న రాజేష్‌ దత్తా ….భార్య ఉండగానే వేరే అమ్మాయిలకు … పెళ్లి కాలేదని అబద్దాలు చెప్పి వారితో ఎపైర్స్ పెట్టుకున్నాడని అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను ఇంట్లోంచి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ విషయంపై గట్టిగా నిలదీస్తే..అంతా నా ఇష్టం. నేను ఎవరితోనైనా తిరుగుతాను, నీ ఇష్టమొచ్చింది చేసుకోపో అంటూ రాజేష్‌ తెగేసి చెప్పేవాడని, అంతేకాకుండా ఆ అమ్మాయిలను డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చేవాడని వాపోయింది. అమ్మాయిలతో ఎఫైర్ లు ఏంటి.. వాళ్లను ఇంటికి తీసుకువస్తున్నావేంటి అని అడిగినందుకు ఆమెను కట్టు బట్టలతో బయటకు గెంటేశాడు.


దీంతో ఆమె తల్లితండ్రులతో కలిసి జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరో వైపు రాజేష్ ఇంటివద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. నటుడు రాజేష్‌.. కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, తూర్పు వెళ్లే రైలు సహా దాదాపు 28 సీరియల్స్‌లో నటించాడు.2105 జూన్‌6న తెలుగు టీవీ సీరియల్స్ లో నటించే రాజేష్‌ దత్తాతో విజయవాడలో చాలా ఘనంగా తన పేరెంట్స్ పెళ్లి చేశారని… 15 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం కూడా కట్నంగా ఇచ్చాం అని సాధన తెలిపింది. పెళ్లైన మూడు నెలలు మా కాపురం సాఫీగా….ఎంతో అన్యోన్యంగా సాగింది.


అయితే ఆ తర్వాత రాజేష్‌ తీరులో చాలా మార్పొచ్చింది. నన్ను చెన్నై తీసుకెళ్లాడు. సీరియల్స్‌ షూటింగ్ ఉందంటూ భార్యను చెన్నైలో ఉంచి తను మాత్రం హైదరాబాద్‌ వచ్చేవాడు. ఇక్కడ వేరే అమ్మాయిలతో తనకు పెళ్లి కాలేదని అబ్బదాలు ఆడి వాళ్లతో సంబంధాలు పెట్టుకునేవాడు. ఇందేంటని అడిగితే తనని హింసించేవాడు’ అని రాజేష్‌ భార్య సాధన వివరించింది.