యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఒక దానిని మించి మరొకటి

 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఒక దానిని మించి మరొకటి అన్నట్టు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు ఉండగా ఈ చిత్రాలన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు అభిమానులకు షాకింగ్‌గా మారుతున్నాయి.


తాజా సమాచారం ప్రకారం సలార్ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించనున్నట్టు తెలుస్తుంది. అయొతే ఆయనది చిన్న పాత్రే అయినప్పటికీ, విలన్స్ ను లీడ్ చేసే మెయిన్ విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2021లో రానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదు నెలల కాల్షీట్స్ కేటాయించనున్నాడట.