విశాఖ ఉక్కు దీక్షా శిబిరం అగ్నికి ఆహుతయింది.

 


విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటైన విశాఖ ఉక్కు దీక్షా శిబిరం అగ్నికి ఆహుతయింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు శిబిరానికి నిప్పంటించారు. మంటలను గమనించిన వాకర్స్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. శిబిరంలోని కుర్చీలు, బల్లలు, ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆదివారం ఇదే స్థలంలో కార్మికులు నిరసన తెలిపారు.