అందాల ముద్దుగుమ్మ సమంత తన కెరీర్‌ని చక్కగా ప్లాన్

 


అందాల ముద్దుగుమ్మ సమంత తన కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంపై దృష్టి పెడుతుంది. ఇటీవల పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించగా, ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఇండియాలో మొదటిసారి భారీ లెవల్లో విజయం సాధించిన వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందగా, 'ది ఫ్యామిలీ మ్యాన్ -2' పలు కారణాల రీత్యా వాయిదాపడింది.


2021 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి కాగా, జూన్ 11న పార్ట్ 2ను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపైఐ అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మనోజ్ బాజ్‌పేయ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా, ఇందులో సమంత నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తుంది. సమంత పాత్ర ఈ సిరీస్‌లో చాలా కీలకం అని తెలుస్తుంది.