చైనా ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ .....

 


చైనా ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.. అదే ఏ క్షణంలోనైనా భూమిపై పడే ప్రమాదం ఉందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరిస్తోంది. 21 టన్నుల బరువున్న చైనా లాంగ్ మార్చ్ 5B అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది. రానున్న రోజుల్లో రాకెట్ శిధిలాలు తిరిగి భూమిపై పడిపోయే ఉందని ఇటీవలే పరిశోధకులు హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ఆ చైనా రాకెట్ నుంచి శిధిలాలు అంతర్జాతీయ జలాల్లో పడే అవకాశం ఉందని చైనా గ్లోబల్ టైమ్స్ నివేదించింది.


గత వారమే అంతరిక్ష కేంద్రంలో కొంత భాగాన్ని కక్ష్యలోకి పంపిన చైనా రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ రాకెట్ నుంచి శిధిలాలు భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. లాంగ్ మార్చి 5 బి రాకెట్ ఏప్రిల్ 29న హైనాన్ ద్వీపం నుంచి టియాన్హే మాడ్యూల్‌ను ప్రయోగించింది. 2022 నాటి కల్లా సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ శాశ్వత చైనీస్ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు సిబ్బందికి నివాసంగా మారనుంది. రాకెట్ శిధిలాలు భూమికిపైకి ఏ క్షణంలోనైనా దూసుకురావొచ్చు.. అయితే రాకెట్ రీ-ఎంట్రీ పాయింట్ ఎక్కడ పడుతుందనేది అస్పష్టంగానే ఉంది. పేలిన రాకెట్ నియంత్రణలో లేదు.. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని నివేదిక చెబుతోంది.