ముందు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. ఆ తర్వాత ఏసీబీ దాడులు..

 


ముందు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. ఆ తర్వాత ఏసీబీ దాడులు.. ఇప్పుడు కీలకమైన మరో అడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే అంశంపై జీవో విడుదల చేసింది. అయితే అది సాంకేతికంగా చెల్లదని తెలియడంతో.. ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇప్పుడు టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా కొత్తగా మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూపొందించిన డ్రాఫ్ట్ లీజు ఒప్పందానికి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది.

ప్రభుత్వ-అమూల్ ప్రాజెక్టులో భాగంగా లీజు ప్రాతిపదికన ఏపీ డెయిరీకి వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల పునరుజ్జీవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.


ఇప్పటికే ధూళిపాళ్ల నరేంద్ర ఏపీ డెయిరీ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. బెయిల్ కోసం వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఫ్రభుత్వం వేస్తున్న ఒక్కో అడుగు పరిశీలిస్తుంటే.. దాదాపు రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్ధ మొత్తం అమూల్ చేతికే వెళ్లేట్లు కనపడుతోంది. ఈ వ్యూహంతో పాల ఉత్పత్తిదారుల సహకార వ్యవస్ధ బలోపేతం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.