డిజిటల్ పేమెంట్ సెక్టర్‌లో తనదైన స్థానంలో ఉన్న'పేటీఎం' అతిపెద్ద సంచలనం

 


 డిజిటల్ పేమెంట్ సెక్టర్‌లో తనదైన స్థానంలో ఉన్న'పేటీఎం' అతిపెద్ద సంచలనంతో రాబోతుంది. ఏకంగా ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 21,800 కోట్లను సమీకరించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వినవస్తోంది. అదే నిజమైతే దేశంలో అతిపెద్ద లిస్టింగ్ కూడా ఇదే కానుంది. దేశ చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో ఐపీఓకు వచ్చిన కంపెనీ మరొకటి లేదు.


దీపావళి సీజన్ లో ఇది మార్కెట్‌లోకి వస్తుందని వినవస్తోంది. ఇందులో ఇన్వెస్టర్లుగా కూడా పెద్దపెద్ద కంపెనీలే ఉన్నాయి. వీటిలో బెర్క్ షైర్ హాథ్ వే, సాఫ్ట్ బ్యాంక్, యాంట్ గ్రూప్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. కంపెనీ వాల్యుయేషన్ 25-30 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

అధికారికంగా పిలిచే ఫార్మల్ నేమ్ ఓన్‌ఈ97 బోర్డు ఈ వారం సమావేశం కానుంది. ఐపీఓ విషయమై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఐపీఓ నిర్వహణకు మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్ ఐఎన్‌సీ,జేపీ మోర్గాన్ అండ్ కంపెనీ ీతదితర బ్యాంకులను ఎంచుకుంది కంపెనీ. సెబీ నిబంధనల ప్రకారం రెండేళ్లలో కంపెనీ 10 శాతం షేర్లు... ఐదేళ్లలో 25 శాతం ఆఫ్ లోడ్ చేయాల్సి ఉంటుంది.