ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేఖ

 


కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను వైఎస్సార్ బీమా లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపు ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతులకు రూ.2 లక్షలు అందజేయాలన్నారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.15 వేలు చెల్లించాలన్నారు. వైఎస్సార్ బీమా అమలు ప్రకటనలకే పరిమితమవుతోంది.. తప్ప పేదలకు సాయం అందడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని చెప్పారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేఖలో తెలిపారు.