ఆన్‌లైన్‌ వ్యాపారంలో దూసుకెళ్తున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌ వంటి దిగ్గజాలకు ఇకపై టాటా కూడా పోటీ

 


ఆన్‌లైన్‌ వ్యాపారంలో దూసుకెళ్తున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌ వంటి దిగ్గజాలకు ఇకపై టాటా కూడా పోటీగా నిలవనుంది. ఆన్‌లైన్‌ గ్రాసరీ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా టాటా సన్స్‌ సొంతమైంది. టాటా సన్స్‌ అనుబంధ సంస్థ టాటా డిజిటల్‌ బిగ్‌బాస్కెట్‌లోని 64.3 శాతం వాటాను సొంతం చేసుకుంది.

2019లో 1.9 బిలియన్‌ డాలర్లు విలువ కలిగిన బిగ్‌బాస్కెట్ సంస్థ 2020 చివరి నాటికి 3 బిలియన్‌ డాలర్ల విలువను తాకింది. 2024నాటికి ఈ సంస్థ 18 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. బిగ్‌బాస్కెట్‌లో జాక్‌ మా నేతృత్వంలోని అలీబాబాకు 29శాతం, ఆది గోద్రెజ్‌కు కూడా 16.3 శాతం వాటాలున్నాయి.