అనేక వినూత్న ఆఫర్లతో దేశంలో టెలికాం రంగంలో జియో సంచలనం

 


అనేక వినూత్న ఆఫర్లతో దేశంలో టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో తీసుకువచ్చిన తక్కువ ధరకు డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్లతో మిగతా కంపెనీలు కూడా అదే బాటలో పయనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జియో ఫోన్స్ తో తక్కువ ధరకు పేదలకు ఫోన్ తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చి మంచి మనస్సు చాటింది. ఎలాంటి రీఛార్జ్ చేయించకున్నా నిత్యం పది నిమిషాలు అంటే నెలకు 300 నిమిషాల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది జియో. ఈ ఆఫర్ ఈ కరోనా విపత్తు ముగిసే వారకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది సంస్థ.