బాలీవుడ్‌, కోలీవుడ్ డైరెక్టర్లతో వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు

 బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని ప్యాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసిన డార్లింగ్‌.. ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్ డైరెక్టర్లతో వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్న సలార్‌కు సంబంధించి ఎన్నో అంచనాలున్నాయి.


ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్టు న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు గూస్‌బంప్స్ అనేలా ఉన్నాయి. ప్రభాస్ లుక్ ఊర మాస్‌, బ్లాస్టింగ్‌లాగా అనిపిస్తోంది.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి తండ్రి పాత్రలో ఆయన ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఉన్నంత సేపు గూస్‌బంప్స్ అనేలా ఉంటుందట. దీని తర్వాత కొడుకుగా తండ్రి ఆశయం కోసం పనిచేసే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.