భారతదేశానికి అమెరికా కొత్త రాయబారి

 


 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారతదేశానికి అమెరికా కొత్త రాయబారిని నియమించే విషయమై లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బైడెన్ పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్న ఎరిక్ ముందు వరుసలో ఉన్నట్లు ప్రముఖ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా, ఎరిక్ ఇంతకుముందు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సయమంలో ఎన్నికల ప్రచార బృందంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రచార బృందానికి ఆయన కో-చైర్‌గా పనిచేశారు.