రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌

 


రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండలాలు, గ్రామాల్లో 'రైతు గోస- బీజేపీ పోరు దీక్ష' పేరుతో ఉద్యమం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. రైతు పంటను అమ్ముకునే పరిస్థితి లేదని, రైతు కళ్లలో ఆనందం చూస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌, వారి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తున్నారని విమర్శించారు. ఈ సీజన్‌లో 94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 54 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు మూసివేయాలంటూ అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారని, మిగతా 40 లక్షల టన్నులు ఈలోగా కొనుగోలు చేయడం సాధ్యమేనా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.