నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయం

 


నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18,449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు. మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ ముందుంది. ఇక కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది.