అగ్రరాజ్యం అమెరికాలో వింత పదార్థం

 


అగ్రరాజ్యం అమెరికాలో వింత పదార్థం దర్శనమిచ్చింది. దీన్ని చూసిన కొందరు స్థానికులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇక్కడి కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ తీరానికి ఈ వింత పదార్థం కొట్టుకొచ్చింది. అదేంటో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న నేషనల్ పార్క్ సర్వీసు విభాగం ఇదేంటో గుర్తించాలంటూ నెటిజన్లను కోరింది. ఈ పదార్థం ఏంటో తాము గుర్తించలేకపోయామని నేషనల్ పార్క్ సర్వీసు అధికారులు తెలిపారు. ఈ సంస్థ మాత్రం దీన్ని స్వ్కిడ్ యొక్క అండపు తిత్తి అని భావిస్తోందట. దీన్ని ఎవరైనా గుర్తుపడతారేమో చూడాలి మరి.