ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌

 


అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 4, 5, 13, 16, 17 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది. 2వ వార్డులో నిర్మల, 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్‌ బేగం 116 ఓట్లతో, 5వ వార్డులో లావణ్య, 13వ వార్డులో శివకృష్ణ, 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరసింహ గౌడ్‌ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, 17వ వార్డులో శ్రీనివాసులు గెలుపొందారు.

మున్సిపాలిటీలోని 1, 7, 10, 11, 14 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.