నకిలీ ఫ్రంట్‌లైన్ వారియర్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

 


సినిమాల విషయంలో ఏమో కానీ వార్తల్లో మాత్రం నిలుస్తోంది హీరోయిన్ మీరా చోప్రా. వాన, బంగారం, మారో వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. అయితే సోషల్ మీడియా పుణ్యమాని వార్తల్లో వ్యక్తి అవుతుంది. ఇప్పుడు మరోసారి మీరా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. వివరాల్లోకెళ్తే.. కరోనా వ్యాక్సిన్ ఈ హీరోయిన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది. అయితే అసలు చిక్కు అక్కడే వచ్చింది. మీరా చోప్రా నకిలీ ఫ్రంట్‌లైన్ వారియర్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకుందని తెలియడంతో బీజీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీరా చోప్రాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. దీంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ విచారణ చేస్తున్నామని, నేరం రుజువైతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పరిస్థితి గమనించిన మీరా చోప్రా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తన పోస్ట్‌ను తొలగించింది.