కృతి శెట్టి సాయితేజ్ జోడీగా ఒక సినిమా

 


టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే అనేక మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా ఈ కృతి శెట్టి సాయితేజ్ జోడీగా ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


దేవ కట్టా డైరెక్షన్‌లో 'రిపబ్లిక్' సినిమాను పూర్తిచేసిన సాయితేజ్, ఆ తరువాత సినిమాను కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంపిక చేసిన్నట్లు చెప్పుకుంటున్నారు. 'ఉప్పెన' సినిమా వెనుక సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు చేస్తున్న సినిమా కావడం వలన, కృతి శెట్టి కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.