అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్... సంచలనాత్మకమైన నిర్ణయం

 


అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్... సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పాతిక సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలందిస్తోన్న ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ప్రస్థానం ఇక ముగిసిపోనుంది. వచ్చే ఏడాది జూన్ 15 వ తేదీ నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను నిలిపివేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ వెబ్ బ్రౌజర్‌ను విండోస్ 95 తో కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్ అప్లికేషన్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించామని, విండోస్ 10 కి చెందిన కొన్ని వర్షన్లలో 2022 జూన్ 15 నుండి ఈ సేవలు అందుబాటులో ఉండవని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రాం మేనేజర్ సియాన్ లిండర్‌సే తెలిపారు.