డిజిటల్‌ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం అత్యంతభారీ పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు

 


 డిజిటల్‌ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం అత్యంతభారీ పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా 3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.21,700 కోట్లు) సమీకరించాలని కంపెనీ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి.. ఈ స్థాయిలో నిధులు సమీకరిస్తే దేశంలోనే అత్యధిక మొత్తం నిధులు సమీకరించిన ఐపీఓగా ఇది చరిత్రకెక్కుతుంది. కంపెనీ విలువను 25 బిలియన్‌ డాలర్లుగా పరిగణించి, 3 బిలియన్‌ డాలర్లను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించాలని పేటీఎం భావిస్తోంది. ఐపీఓ ప్రతిపాదనపై చర్చించేందుకు శుక్రవారం పేటీఎం బోర్డు సమావేశం కావొచ్చు.