మనోజ్‌ను హిట్స్ పలకరించకపోవడంతో సైలెంట్

 


మంచు మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కెరీర్ తొలి నాళ్లలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అయితే ఇటీవలి కాలంలో మనోజ్‌ను హిట్స్ పలకరించకపోవడంతో సైలెంట్ అయ్యాడు. కాని త్వరలో మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ రోజు మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్బంగా ఆయన నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం చేపట్టారు.


ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కొవిడ్ వలన ప్రభావితం అయిన వాళ్లందరికి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను అని మనోజ్ తెలిపారు. ముందుగా మన ప్రాణాలని కాపాడడానికి వాళ్ల ప్రాణాలని పణంగా పెట్టి మనందరిని కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్క్‌లు ధరించి సానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి.


నా వంతుగా ఈ పుట్టిన రోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి కొవిడ్ వలన ప్రభావితం అయిన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులని అందించి నా వంతు సహాయం చేస్తూ, దీనిని ఇలానే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం అని మనోజ్ పేర్కొన్నారు.