సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సిఐఐ) లండన్‌లో భారీ పెట్టుబడులు భారత్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సిఐఐ) లండన్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌తతో కుదిరిన బిలియన్‌ డాలర్ల వాణిజ్య పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సిఐఐ లండన్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌లో 240 మిలియన్ల పౌండ్లతో పెట్టే పెట్టుబడులతో సుమారు 6,500 ఉద్యోగాలు సృష్టి జరగనున్నట్లు లండన్‌ ప్రభుత్వం తెలిపింది. భారత్‌ ప్రధాని మోడీ, లండన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇరు దేశాధినేతల వర్చువల్‌ సమావేశానికి ముందే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. లండన్‌లోని జాన్సన్‌ ప్రభుత్వం భారత్‌తోనే కాకుండా.. సింగపూర్‌, జపాన్‌ దేశాలతో సహా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.