ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అర్దరాత్రి భూకంపం

 


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అర్దరాత్రి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ ప్రాంతం కేంద్రంగా అర్దరాత్రి 12.31 గంటలకు భూమి కంపించింది. చమోలీ జిల్లాతోపాటు డెహ్రాడూన్, పౌరి, గర్హాల్ జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి.22 కిలోమీటర్ల లోతులో నుంచి సంభవించిన భూకంపం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.అర్దరాత్రి భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.