జూలై నుండి ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు

 


కరోనా మహమ్మారి సినీ లవర్స్‌కు వినోదం అనేదే లేకుండా చేసింది. గత ఏడాది కరోనాతో దాదాపు 9 నెలల పాటు థియేటర్ వైపే చూసే అవకాశం రాలేదు. ఇక సెకండ్ వేవ్ వలన మళ్లీ థియేటర్స్ మూతపడడంతో వెండితెరపై సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. మళ్లీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, పెద్ద తెరపై మూవీస్‌ని ఎప్పుడు చూస్తామా అన్న సినీ లవర్స్‌కు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు గుడ్ న్యూస్ చెప్పారు.


జూలై నుండి ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు వస్తాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా లాక్ డౌన్ నడుస్తోంది. కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతన్నాయి. మరో రెండు వారాలు లాక్‌డౌన్ కఠినంగా పాటిస్తే కరోనా నెమ్మదించడం ఖాయం కాబట్టి జూలై నాటికి షూటింగ్స్ మొదలు కావడమే కాక థియేటర్స్ కూడా తెరచుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి థియేటర్స్ తెరచుకున్నాక 'ఆచార్య', బాలకృష్ణ 'అఖండ', ప్రభాస్ 'రాధేశ్యామ్', అల్లు అర్జున్ 'పుష్ప' 'ఖిలాడి, శ్యామ్ సింగ రాయ్' , ఆర్ఆర్ఆర్ చిత్రాలు థియేటర్ లోకి దూసుకురానున్నాయి.