క్రిప్టొ కరెన్సీలో పెట్టుబడుటు పెట్టినవారికి గడచిన వారంలో పెద్ద ఎదురుదెబ్బ

 


 క్రిప్టొ కరెన్సీలో పెట్టుబడుటు పెట్టినవారికి గడచిన వారంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 800 బిలియన్ డాలర్లకు పైగా సంపద హరించుకుపోయింది. వివరాలిలా ఉన్నాయి. బిట్‌కాయన్ ఇప్పుడు 30 వేల డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఇది 50 శాతం వరకు పడిపోయింది.


ఈ క్రమంలో... టైం గరిష్టం 60 వేల డాలర్లను టచ్ చేసిన బిట్ కాయన్ ఇప్పుడు 30 వేల డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. మిగిలిన క్రిప్టో కరెన్సీలు కూడా 63 శాతం మేరకు పతనమయ్యాయి. పెట్టుబడిదారులకు ఇది అతిపెద్ద బ్లో అవుట్. ఒకప్పుడు క్రిప్టో మార్కెట్ క్యాప్ 1.49 ట్రిలియన్ డాలర్లు.. ఇప్పుడిది సుమారుగా సగానికి పడిపోయింది. బిట్ కాయన్, ఎథేరియం సహా పలు క్రిప్టో కరెన్సీలు గత కొద్ది నెలలుగా రికార్డ్ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు క్రిప్టో సేవలనందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


అటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా తమ వ్యాపార లావాదేవీల్లో దీనిని అనుమతిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో... ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీ చెల్లుబాటు పెరుగుతుందన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో పెరిగింది. దీంతో సహజంగానే డిమాండ్ పెరిగి ధర అమాంతం పెరిగింది. బిట్ కాయన్ తో పాటు.. ఇతర క్రిప్టోలకు కూడా డిమాండ్ వచ్చింది.

మొత్తంమీద క్రిప్టోలు ఆల్ టైం గరిష్టాలకు చేరాయి. కాగా... పతనం కావడానికి కూడా ఎంతోకాలం పట్టలేదు. ఈ క్రమంలో... ప్రోత్సహించిన వారే... వ్యతిరేక ప్రకటనలు చేశారు ఎలాన్ మస్క్ తమ కంపెనీలో బిట్ కాయన్ కరెన్సీని అనుమతించబోమని ప్రకటించారు. దీంతో పాటు అదే సమయంలో చైనా కూడా బిట్ కాయన్ లావాదేవీలు చేయరాదని ఫైనాన్షియల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో... క్రిప్టో కరెన్సీ విలువ అమాతం 50 శాతం పడిపోయింది. ఒక్కరోజే 40 శాతం పడిపోవడం గమనార్హం. మరికొన్ని వివరాలిలా ఉన్నాయి.


బిట్‌కాయిన్‌కు పెద్దగా భవిష్యత్తు కనిపించడం లేదంటున్న వ్యాఖ్యానాలు ఇప్పుడు వినిపిస్తున్నారునిపుణులు. చైనా వ్యతిరేకించడం, భారత్ కూడా దీనిని నిషేధించే దిశగా యోచిస్తుండడం, ఇప్పటికే అనధికారికంగా ఆర్‌బీఐ ఆదేశాలు కూడా ఇవ్వడం తెలిసిన విషయాలే.