రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..?

 


రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..? తీర ప్రాంతాలకు ముప్పు తప్పదా ? అంటే..అవునంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా..ఇండియాకు తుఫాన్ ల బెడద పెరగబోతోందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తౌటే తుఫాన్ ధాటికి..పశ్చిమ తీర ప్రాంతం అతాకుతలమౌతోంది. గడిచిన 150 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే..ఇండియాకు వచ్చే తుఫాన్ లు ఎక్కువ శాతం


బంగాళాఖాతంలోనే..రూపుదిద్దుకున్నాయి. అరేబియా సముద్ర తీరంలో ఏర్పడే అల్పపీడనం తక్కువ. గడిచిన 100 ఏళ్ల తుఫాన్ లను పరిశీలిస్తే…బంగాళాఖాతంలో 4 తుఫాన్ లు వస్తే..అరేబియాలో ఒక్క తుఫాన్ మాత్రమే వచ్చింది. కానీ..గత కొన్ని సంవత్సరాలుగా మార్పులు వస్తున్నాయి. బే ఆఫ్ బెంగాల్ కు పోటీగా అరేబియా తీరంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.


సాధారణంగా అల్పపీడనం ఏర్పడాలంటే..సముద్రంలో ఉష్ణోగ్రతలు..28 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. బంగాళఖాతంతో..పోల్చినప్పుడు..అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే..పరిస్థితిలో మార్పు వచ్చింది. అరేబియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందువల్లే ప్రమాదకర తుఫాన్ లు వస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.


రెండేళ్ల కిందట కేరళ రాష్ట్రాన్ని తుఫాన్ గజగజ వణికించగా..ఈసారి కేరళ నుంచి గుజరాత్ వరకు పశ్చిమ తీరం తౌటే దెబ్బకు విలవిలలాడింది. గ్లోబల్ వార్మింగ్ ఇదే తీరుగా కంటిన్యూ అయితే..ఇటు అరేబియా..అటు బంగాళాఖాతంలో..మరిన్ని తుఫాన్ లు వస్తాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.