తెలంగాణలో వరుసగా వర్షాలు

 


ఇప్పటికే తెలంగాణలో వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అకాలవర్షాలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితిలు వచ్చాయి.. అయితే, మరో మూడు రోజులు తెలంగాణలో వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ... నిన్నటి నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని.. ఈ రోజు ఉపరితల ద్రోణి పశ్చిమ విదర్భ నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని.. దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం ఉందని.. స్పష్టం చేసింది.. ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురగాలులు మరియు వడగండ్లతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఒకటి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉందని.. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది వాతావరణశాఖ.