ఓ పాట ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌పై ప్లాన్‌ చేశారట.

 


ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం'లో ఇంకా రెండు పాటలను తెరకెక్కించాలి. అందులో ఓ పాట ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌పై ప్లాన్‌ చేశారట. సినిమా ప్రత్యేక ఆకర్షణల్లో అదొకటిగా నిలుస్తుందని, ఈ ఒక్క పాట చిత్రీకరణకు నెల రోజులు పడుతుందని ఫిల్మ్‌నగర్‌ ఖబర్‌. మరో పాటను రామ్‌ చరణ్‌ - ఆలియా భట్‌ జోడీపై తెరకెక్కించాల్సి ఉంది. పాటలు కాకుండా టాకీ పార్ట్‌ దాదాపుగా చిత్రీకరించారని, కొంత ప్యాచ్‌వర్క్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉందని సమాచారం. పది రోజులు చిత్రీకరణ చేస్తే... ఆ ప్యాచ్‌వర్క్‌ పూర్తవుతుందట. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, నిర్మాత: డీవీవీ దానయ్య.