గ్లోబల్ బ్యాటరీ రంగంలో అతిపెద్ద కంపెనీల్లొ ఒక్కటైన అమరరాజా బ్యాటరీస్...

 


 గ్లోబల్ బ్యాటరీ రంగంలో అతిపెద్ద కంపెనీల్లొ ఒక్కటైన అమరరాజా బ్యాటరీస్... 2020-21 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో నికర లాభం 38 శాతం పెరిగుదలతో రూ. 189 కోట్లుగా చూపించింది. కాగా... 2019-20 జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది రూ. 137 కోట్లకు పరిమితమైంది. ఇక... 2019-20 నాలుగో త్రైమాసికంలో రెవిన్యూ రూ. 1,581 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం రూ. 2,103 కోట్లుగా ప్రకటించింది. వార్షిక ఫలితం... 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 647 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది స్వల్పంగా తగ్గింది. రూ.661 కోట్లుగా ఉంది. మొత్తం రెవిన్యూ మాత్రం రూ . 7,150 కోట్లకు పెరిగింది. 2019-20 లో ఇది రూ. 6,839 కోట్లుగా ఉంది. కాగా... ఏడాదిగా ఎదురైన సవాళ్లను కంపెనీ సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడింది. ఉద్యోగులు మంచి పనితీరుతో ఉత్పత్తి తగ్గకుండా స్ట్రాంగ్ గ్రోత్ చూపించగలిగారని వినవస్తోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ లాక్ డౌన్లు ఉన్నప్పటికి కూడా సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా మార్కెట్ అవసరాలను తీర్చగలిగినట్టు కంపెనీ చెబుతోంది.