పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్న యజమానిని అరెస్టు

 


 కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్న యజమానిని అరెస్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొవిడ్ నిబంధనలను పాటించేలా ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇండోర్ నగరంలోని పలాసియా ప్రాంతంలో కొవిడ్ కర్ఫ్యూ విధించిన సమయంలో ఓ యజమాని తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నారు.పెట్రోలింగ్ పోలీసులు కుక్కతోపాటు దాని యజమాని అయిన వ్యాపారవేత్తను అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కుక్కతోపాటు దాని యజమానిని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.దీంతో కుక్కను అరెస్టు చేసిన ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు