అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు

 


అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికాలోని శాన్​ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతంలో ఓ బస్సులో యువతి పుట్టిన రోజు పార్టీ జరుగుతుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి 12.20 గంటల ప్రాంతంలో శాన్​ ఫ్రాన్సిస్కో నుంచి ఓక్లాండోకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సును వెంబడించి మరీ ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడినట్లు అందులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు. దుండగులు బస్సుపై సుమారు 70 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.