స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్ఫర్మేన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ క్రెడిట్

 


స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్ఫర్మేన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ క్రెడిట్ సూస్‌కు భారత్‌లో తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం ఉంది. ఇప్పుడు ఈ సంస్థ మరో వెయ్యి మంది ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌లో వెయ్యికి పైగా టెక్కీల నియామకానికి ప్రణాళికలు రూపొందించినట్లు స్విస్ బ్యాంక్ దిగ్గజం తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఏపీఐ డెవలప్‌మెంట్, మెషీన్ లెర్నింగ్, ఏఐ వంటి టెక్నాలజీల్లో డెవలపర్స్, ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు తెలిపింది.


బ్యాంకు అంతర్జాతీయ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారత్‌లో తన ఉనికిని విస్తరించడానికి క్రెడిట్ సూస్ చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించింది. భారత్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే 2000 మంది ఐటీ ఉద్యోగులను నియమించుకున్నామని తెలిపింది.


క్రెడిట్ సూస్ ప్రకారం బ్యాంకింగ్ సొల్యూషన్స్ పైన వర్క్ చేసే డెవలపర్లు, ఇంజినీర్స్‌ను నియమించుకోనుంది. కరోనా కారణంగా డిజిటల్ సొల్యూషన్స్‌కు ప్రాధాన్యత పెరిగిందని క్రెడిట్ సూస్ సీనియర్ ఫ్రాంచీ ఆఫీసర్ జాన్ బర్న్స్ అన్నారు.