జమ్మూకశ్మీరులోని సాంబా సెక్టారులో బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు

  జమ్మూకశ్మీరులోని సాంబా సెక్టారులోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడుతున్న ఓ వ్యక్తిపై మంగళవారం రాత్రి బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాక్ చొరబాటుదారుడు గాయపడ్డాడు. అనంతరం చొరబాటుదారుడిని అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. తమ జవాన్ల కాల్పుల్లో చొరబాటుదారుడికి బుల్లెట్ గాయమైందని బీఎస్ఎఫ్ తెలిపింది. పాకిస్థాన్ జాతీయుడు మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు చేసిన యత్నంతో తాము కాల్పులు జరిపామని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు. గత 15 రోజుల్లో సాంబా సెక్టారులో పాకిస్థాన్ నుంచి చొరబాటు యత్నం జరగడం రెండోసారి. మే 5వతేదీన సరిహద్దు వద్ద ఓ పాక్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది.