పట్టుబడ్డ జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి స్వీపర్ నుంచి లంచం.........

 


జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ మహాలక్ష్మి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా స్వీపర్ సాలెమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి మృతిచెందారు. దీంతో ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో మల్లాపూర్‌లోని ఓ హోటల్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.