బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపాన్ దృష్ట్యా ముందుజాగ్రత్త

 


బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపాన్ దృష్ట్యా ముందుజాగ్రత్తగా మే 24 నుంచి మే 29వతేదీ వరకు 25 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. యాస్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర జారీ చేసిన హెచ్చరికలతో రైళ్ల రాకపోకలను ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతాల్లో యాస్ తుపాన్ వల్ల గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో రైళ్లను రద్దు రద్దు చేశారు.గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్, ముజఫర్ పూర్- యశ్వంత్ పూర్, ఎర్నాకుళం-పాట్నా రైళ్లను రద్దు చేశారు. సిల్చార్, న్యూజల్పాయ్ గుడి, జయనగర్, పూరి, గౌహతి, పాట్నా, అగర్తలా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్రన్ రైల్వే వెల్లడించింది.