డిజిటల్ చెల్లింపులు నేపథ్యంలో తమ యూజర్లకు గూగుల్ పే శుభవార్తడిజిటల్ చెల్లింపులు నేపథ్యంలో తమ యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. గూగుల్ పే వినియోగదారులు ఇక పై అమెరికా నుంచి భారత్‌, సింగపూర్‌ యూజర్లకు డబ్బులు పంపే వెసులుబాటును అందించింది. యూజర్లకు ఈ సదుపాయం కల్పించేందుకు గూగుల్ పే ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్, వైజ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్‌తో నగదు బదిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇకపై అమెరికా యూజర్లు మరో 200 దేశాలకు, వైజ్ ద్వారా 80 దేశాలకు డబ్బు పంపుకునే సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పే ప్రకటించింది. ఈ సదుపాయాలు వ్యక్తిగత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, బిజినెస్ అకౌంట్లకు ఈ సౌకర్యం ఉండదని పేర్కొంది.