పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బ్యూటీ డాల్ పూజా హెగ్డేను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారట.

 


    

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బ్యూటీ డాల్ పూజా హెగ్డేను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారట. ఇంతకీ ఆయనలా చేయడానికి కారణమేంటో తెలుసా? వివరాల్లోకెళ్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇందులో ఈమె పాత్ర పేరు ప్రేరణ. వారం, పదిరోజుల షూటింగ్ మినహా సినిమా చిత్రీకరణ, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రీసెంట్‌గా ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి 'రాధేశ్యామ్' ఫస్ట్ కాపీని చూశారట. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా పూజా హెగ్డే తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుందని తన సన్నిహితుల దగ్గరఆమెను ప్రశంసలతో ముంచెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సర్కస్' సినిమాతో పాటు సల్మాన్‌ఖాన్ సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. అలాగే ఆచార్యలో రామ్ చరణ్‌కు జోడీగా నటించింది. దళపతి విజయ్ 65 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి కాకుండా అఖిల్ హీరోగా చేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది పూజా హెగ్డే.