తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనంతెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై విచారణ మొదలైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కు చేరుకున్నారు ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు. అలాగే అచ్చంపేట గ్రామ పరిధిలో భారీ పోలీసు బలగాలు మోహరించాయి. ఒకవైపు బాధితుల నుంచి సమాచారం తీసుకుంటూనే, మరోవైపు క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఏడుగురు ఫిర్యాదు చేసినప్పటికీ.. మరింత మంది బాధితులు నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. భారీ బందోబస్తుతో రెవిన్యూ, ఎసిబి, విజిలెన్స్ అధికారులు విచారం చేస్తున్నారు.