పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు

 


మన దేశంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి.. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి. ఆ ఎన్నికలు అయిపోగానే.. పెట్రోల్ ధరలు పెరగడం మొదలైంది. తాజాగా మూడో రోజు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.99 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.81.42 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.57కు చేరగా.. డీజిల్ ధర రూ. 88.77 కు చేరింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ. 97.34కు చేరగా.. డీజిల్ ధర రూ. 88.39కు చేరింది