తీవ్ర నిరాశలో హన్సిక

 

తమిళ చిత్ర సీమలో జూనియర్‌ ఖుష్బూగా గుర్తింపు పొంది, లక్షలాది మంది అభిమానుల అభినందనలు పొందిన నటి హన్సిక. ప్రస్తుతం ఈమె తీవ్ర నిరాశలో కూరుకుని వుందట. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన
సరైన అవకాశాలు రావడం లేదట. ముఖ్యంగా తన అనుచరగణంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో ముమ్మరంగానే ప్రయత్నిస్తోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు. కానీ, హిందీలో ఓ దర్శకుడు నుంచి సానుకూల ఫలితం వచ్చినప్పటికీ.. అది హీరోయిన్‌ పాత్ర కాదట. దీంతో హాన్సిక ఆ పాత్రను నిరాకరించింది. అదే సమయంలో ఒకప్పుడు తన క్యాల్షీట్ల కోసం వేచివున్న దర్శక నిర్మాతలు ఇపుడు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం ఆమెను కృంగదీస్తోంది. కాగా, ప్రస్తుతం హన్సిక నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం 'మహా'. ఈ చిత్రం షూటింగ్‌ రెండేళ్ళ క్రితమే పూర్తయినప్పటికీ.. వివిధ కారణాలరీత్యా ఇంకా విడుదల కాలేదు.