జపాన్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం జపాన్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. హోన్షు దీవుల తీరంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.


శనివారం ఉదయం 6.57 గంటలకు ఈ ప్రాంతంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.


సునామీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం జపాన్‌లో వచ్చిన సునామీతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే.