సిమెంట్ రంగంలో మరో కీలక ఒప్పందం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న భవ్య సిమెంట్స్‌ను అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఒప్పందాన్ని చేసుకున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. భవ్య సిమెంట్స్‌కు చెందిన ఒక్కో షేరును రూ. 51.53 కు అంజనీ కొనుగోలు చేస్తోంది.
భవ్య సిమెంట్స్‌ను 2007 లో ఏర్పాటు చేశారు. పలు రకాల పోర్ట్లాండ్ సిమెంట్‌ను కంపెనీ తయారు చేస్తోంది. కాగా 2019-20 లో భవ్య సిమెంట్స్ టర్నోవర్ రూ. 304 కోట్లు. తాజా నిర్ణయంలో తమ ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్ పెరుగుతుందని అంజనీ పోర్ట్ల్ లాండ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే... ఈ డీల్ విలువకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.