సినిహా హిట్ అయిందంటే దానికి వెంటనే సీక్వెల్ ప్లాన్

 


ఇటీవలి కాలంలో ఓ సినిహా హిట్ అయిందంటే దానికి వెంటనే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కాని ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రానికి సీక్వెల్‌గా పాన్ ఇండియా లెవల్‌లో మూవీ చేయనుండడం ఆసక్తిని కలిగిస్తుంది. యువ హీరో సందీప్ కిషన్ – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం ”మాయవన్”. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. నిర్మాత సి.వి.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు


2017 ఇయర్ ఎండింగ్ లో విడుదలైన మాయవన్ చిత్రం పెద్దగా ప్రేక్షకులని అలరించలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు తాజాగా ‘మాయవన్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు సీవీ కుమార్. మాయవన్ – రీలోడెడ్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తన స్వీయ దర్శకత్వంలో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందని కుమార్ వెల్లడించారు. మరి ఈ సీక్వెల్‌తో అయిన ప్రేక్షకులని మెప్పిస్తారా అనేది చూడాలి. ‘మాయవన్’ సినిమాని తెలుగులోకి ”ప్రాజెక్ట్ జెడ్” పేరుతో అనువాదం చేసిన విషయం తెలిసిందే.