'శ్యామ్ సింగరాయ్' నుంచి నటి సాయిపల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్

 


ఎంతో ప్రతిభ ఉన్న నటి సాయిపల్లవి పుట్టినరోజు మే 9న. జన్మదిన సందర్భంగా ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే మరో సినిమా 'విరాటపర్వం' నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిజానికి ఈ సినిమా గత నెలలోనే విడుదల కావలసి ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్యపాత్రధారులు. సురేశ్ బాబు సమర్పణలో వేణు ఉడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సంక్షోభ సందర్భంగా పుట్టినరోజు విషెస్ చెప్పటం సహేతుకంగా అనిపించటం లేదని అందుకే విరాటపర్వం పోస్టర్ కూడా విడుదల చేయలేదన్న వేణు ఉడుగుల సాయిపల్లవికి ట్విటర్ ద్వారా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. 'మీ అభినయ విశేషముతో ఈ రత్న ఖచిత భువనాన తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి. కాలానికి ఎదురీది నిలబడాలి. జీతే రహోసాయిపల్లవి గారూ' అంటూ ట్వీట్ తో అభినందనలు తెలిపాడు వేణు.