దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్

 


దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. కీలక అంశాన్ని వెల్లడించింది. బ్యాంక్ ఆన్‌లైన్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని తెలియజేసింది. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 8న ఉదయం 2 గంటల నుంచి 5 గంటల వరకు నెట్ బ్యాంకింగ్‌ సహా మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా తన కస్టమర్లకు ఇలాంటి అలర్ట్‌నే జారీ చేసింది. బ్యాంక్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా బ్యాంక్ డిజిటల్ సర్వీసులును బ్యాంక్ కస్టమర్లు పొందలేరని పేర్కొంది. మీకు కూడా స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంక్ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉండవో తెలుసుకుంటే.. అందుకు అనుగుణంగా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.


లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లు మే 7వ తేదీ రాత్రి 10.15 గంటల నుంచి మే 8వ తేదీ అర్ధరాత్రి 1.45 గంటల వరకు బ్యాంక్ డిజిటల్ సర్వీసులు పొందలేరు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మూడున్నర గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సర్వీసులు ఏవీ పని చేయవని బ్యాంక్ కస్టమర్లు గుర్తించుకోవాలి.