భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

 


దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్‌లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్,ఇవాళ కొంత సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పటికీ, నష్టాల్లోనే ఉంది.ఇప్పటికే విధించిన లాక్ డౌన్ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది.


సెన్సెక్స్ నేడు 48,356.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,613.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 48,028.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 11.30గంటల సమయానికి సెన్సెక్స్ 0.61శాతం అంటే 299.04 పాయింట్లు నష్టపోయి 48,483.32 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,584.35 వద్ద గరిష్టాన్ని, 14,416.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గం.11.30 సమయానికి 0.48శాతం అంటే 70.60 పాయింట్లు క్షీణించి 14,560.70 పాయింట్ల ట్రేడ్ అయింది.14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,584.35 వద్ద గరిష్టాన్ని14,416.25 కనిష్టాన్ని తాకింది.