గోవా బ్యూటీ ఇలియానా అందచందాలకు ఎంత మంది మంత్ర ముగ్ధులయ్యారో..?

 


గోవా బ్యూటీ ఇలియానా అందచందాలకు ఎంత మంది మంత్ర ముగ్ధులయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఇలియానా ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగులో అయితే ఆఫర్సే కరువయ్యాయి. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ షో చేస్తుంది. జిమ్ము లు చేస్తూ, యోగాలు చేస్తూ శరీర బరువును తగ్గించుకొని అందరిని ఆశ్చర్యపరిచిన ఇలియానా తన ఫొటోలతో నెటిజన్స్‌తో పెద్ద షాకే ఇచ్చింది.


తాజాగా ఇలియానా సినీ ఇండస్ట్రీపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీ క్రూరమైనది. ఇక్కడ అవకాశాలు అందడంలో సమానత్వం ఉండదని తెలిపింది. పాపులారిటీనే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్‌గా చూస్తారని, ఎప్పుడైతే పాపులారిటీ కోల్పోతారో ఇక అప్పుడు అవకాశాలు రావని ఇలియానా పేర్కొంది. తన విషయంలోను ఇదే జరిగిందంటూ మనసులోని బాధను అభిమానులతో పంచుకుంది ఇలియానా. ఇటువంటి క్రూరమైన పరిస్థితులు ఉన్నచోట నిలబడడం కష్టమని తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫేర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తోంది.