కరోనాపై పోరాటంలో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్క్స్‌కు ఇటీవల పోషకాహారం అందించిన సల్మాన్‌ఖాన్‌...

 


కరోనాపై పోరాటంలో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్క్స్‌కు ఇటీవల పోషకాహారం అందించిన సల్మాన్‌ఖాన్‌... తాజాగా చలనచిత్ర పరిశ్రమలో రోజువారీ కూలీలు, సాంకేతిక నిపుణులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 25 వేల మంది సినీ కార్మికులకు రూ. 1500 ఇవ్వనున్నారు. కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో ఆ మొత్తాన్ని నేరుగా జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ దూబే చెప్పారు. గత ఏడాది సైతం తన వ్యవసాయ క్షేత్రం పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు, సినీ కార్మికులకు సల్మాన్‌ సాయం చేశారు.