తుఫాన్‌ ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

  తుఫాన్‌ ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాగల మరో రెండు రోజులు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్‌ కారణంగా ఆదివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. పలు చోట్ల ఉదయం, సాయంత్రం వర్షం కురిసింది. గ్రేటర్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌లో అత్యధికంగా 5.9సెం.మీ, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 1.1 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.