ప్రముఖ వాల్ట్ డిస్నీ కంపె స్టార్ స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్‌తో సహా వంద ఛానల్స్‌ను మూసివేయనుంది.

 


 ప్రముఖ వాల్ట్ డిస్నీ కంపెనీ ఈ ఏడాది ఆగ్నేయాసియాలో స్టార్ స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్‌తో సహా వంద ఛానల్స్‌ను మూసివేయనుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 30 ఛానల్స్‌ను మూసివేసినట్లు డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ చాపెక్ జేపీ మోర్గాన్ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ సమావేశంలో తెలిపారు.

తాము 2021లో 100 ఛానల్స్ మూసివేయాలని యోచిస్తున్నామన్నారు. భారతదేశంతో సహా హాంగ్‌కాంగ్‌లో పలు క్రీడా ఛానెళ్లను మూసివేయాలని నిర్ణయించుకున్నామని, డి2 సి వైపు వెళ్లాలని భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి స్టార్ స్పోర్ట్స్-1, స్టార్ స్పోర్ట్స్- 2, ఫాక్స్ స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్ -3 సహా 18 ఛానల్స్ మూసివేయనున్నారు. అయితే భారతదేశంలో డిస్నీ ఛానెల్ మూసివేస్తారా లేదా అనే దానిపై చాపెక్ స్పష్టం చేయలేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో డిస్నీ ప్రసారాలకు ప్రత్యేక విధానం అవసరమని చాపెక్ పేర్కొన్నారు.